ETV Bharat / crime

మా అత్తమామలు వేధిస్తున్నారు.. అన్నకు మెసెజ్​ పెట్టి తమ్ముడి ఆత్మహత్య - Yuvukudu atma hatya in sangareddy

అత్తామామలు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వాట్సాప్​లో అన్నకు వాయిస్​ మెసెజ్​ పెట్టి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

A young man commits suicide due to the shame of in-laws
అత్తమామల అవమాన భారంతో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Dec 29, 2022, 2:19 PM IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్​లో విషాదం నెలకొంది. ఇల్లరికం ఇంట్లో అత్తమామలు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన అన్నకు వాట్సాప్​ వాయిస్ మెసేజ్ పంపి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువుల కథనం ప్రకారం.. జాడిమల్కాపూర్ గ్రామానికి చెందిన చాకలి వెంకటేశ్​కు​ అదే గ్రామానికి చెందిన మమతతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. 8 రోజుల క్రితం వెంకటేశ్​, మమత దంపతులకు మగ బిడ్డ పుట్టాడు.

భార్య భర్తలు సంతోషంగా ఉన్న తరుణంలో.. అత్త మామలు అవమానిస్తూ వేధింపులకు గురి చేశారని అవమానభారంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వెంకటేశ్​ ఏడుస్తూ అన్నకు వాయిస్ మెసేజ్ చేశాడు. అనంతరం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్​ మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డ పుట్టిన వారం రోజులకే తమ కుమారుడి మృతికి కారణమయ్యారని వెంకటేశ్​ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.