ETV Bharat / crime

Ganjai Arrest: గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్టు - కిలో గంజాయి స్వాధీనం

గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్​కు చెందిన దేవోజీ వేణును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

A Young man arrested for selling marijuana
గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్టు
author img

By

Published : Oct 29, 2021, 4:50 AM IST

గంజాయి అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాంనగర్​కు చెందిన దేవోజీ వేణు గంజాయి విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

గోదావరిఖని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ గిరి ప్రసాద్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రాంనగర్​కు చెందిన వేణు గత కొంత కాలం నుంచి గంజాయి అక్రమ సరఫరా చేస్తున్నాడని తెలిపారు. అదేవిధంగా గతంలో కూడా ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఏసీపీ సూచించారు. గంజాయి సాగు, అక్రమంగా సరఫరా చేసిన కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Cannabis: మంగళ్​హాట్​ స్పాట్ కానీ రహ్మత్​నగర్​లో దొరికిపోయిన గంజాయి ముఠా

Pharma researchers: చేసింది పీహెచ్​డీ.. చేసేది డ్రగ్స్ తయారీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.