ETV Bharat / crime

suicide: తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య - hyderabad crime news

మద్యానికి బానిస అయిన ఓ యువకుడు కుటుంబ సభ్యులు మందలించారని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని ఖైరతాబాద్​లో జరిగింది.

a young man suicide in khairatabad
ఖైరతాబాద్​లో యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Jun 14, 2021, 5:14 PM IST

హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ ప్రాంతానికి చెందిన రవి కుమార్( 21) అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యానికి బానిసైన రవిని అతని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

రవి కుమార్ ఖైరతాబాద్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. రోజు మద్యం సేవించి ఇంటికి వస్తుండడంతో తల్లిదండ్రులు అతన్ని మందలించారు. ఎంత చెప్పిన వినకపోవడంతో... ఇక ఇంటికి రావద్దని తెగేసి చెప్పారు.

ఈ ఘటనతో మనస్తాపానికి గురైన రవి ఇంట్లోని ఇనుపరాడ్డుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Bullets: కానిస్టేబుల్ బుల్లెట్ల బ్యాగ్ మాయం.. ఇలా దొరికింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.