ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఒకరు మృతి

విధులకు హాజరవ్వడం కోసం ద్విచక్రవాహనంపై వెళుతోన్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టిన ఘటన సూర్యాపేట జిల్లా చింతకుంటపాలెం మండలంలోని అంజనీ సిమెంట్ ఫాక్టరీ వద్ద జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

accident in suryapet district
రోడ్టు ప్రమాదంలో వ్యక్తిమృతి
author img

By

Published : May 7, 2021, 12:41 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలోని అంజనీ సిమెంట్ ఫాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తోన్న రామారావు (25) అనే వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొమ్ముకుంట రామారావు అంజనీ సిమెంట్స్‌ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం ఆఫీస్‌కు రావడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో పులిచింతలకు వెళ్లే మార్గంలో మూలమలుపు వద్ద లారీ అతన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

మూలమలుపు వద్ద దట్టంగా చెట్లు ఉండడంతోనే ఈ జరిగిందని గ్రామస్థులు పేర్కొన్నారు. సదరు చెట్లను తొలగించాలని యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి: అప్పుడు ప్రమాదం... ఇప్పుడు బలవర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.