మహబూబాబాద్ పట్టణానికి చెందిన సుజాత భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఉన్న ఇద్దరు కుమారులు డిగ్రీ చదువుతున్నారు. సుజాతకు తన అన్న చేదోడు, వాదోడుగా ఉండేవాడు. ఇటీవల అన్న మరణించాడు. మనస్తాపానికి గురైన సుజాత.. ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని రైల్వే పట్టాలపై నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న షీ-టీమ్స్ బృందం మహిళను రక్షించారు.
మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎస్సై.. బాధిత మహిళకు కౌన్సెలింగ్ నిర్వహించి.. పంపించారు.