women protest at PS: న్యాయం కోసం ఓ మహిళ వినూత్నంగా నిరసనకు దిగింది. అత్తింటివారి అరిగోసలు భరించలేక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. మెట్టినింటి వారి వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ చంటి బిడ్డలతో సహా ఏకంగా పోలీసు వాహనం పైకి ఎక్కి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో చోటు చేసుకుంది.
అత్తింటి వేధింపులు తాళలేక..
women dharna at police station: అదనపు కట్నం కోసం తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు ఆరోపించింది. రుద్రంగి మండలం గైదిగుట్ట తండాకు చెందిన గుగులోతు మౌనిక అత్తింటివారిపై పోరాటానికి దిగింది. తనను భర్తతో పాటు అత్తా మామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది. తన పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది.
పాపను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు
women at PS: గతంలోనే తన భర్తతో గొడవ జరగడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని మహిళ తెలిపింది. తనకు అంగవైకల్యంతో పుట్టిన పాప ఉందని.. ఆ పాపను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. అయితే గతంలోనే భార్యభర్తల గొడవకు సంబంధించి కేసు నమోదు చేశామని.. ఇప్పుడు ఆ కేసు కోర్టులో ఉందని పోలీసులు వివరించారు. కోర్టుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని మహిళకు సూచించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: