ETV Bharat / crime

అనుమానమే ఆమె ప్రాణాలు తీసింది - ఏవీబీపురంలో మరదలిని అంతమొందించిన బావ

అనుమానమే యువతి పాలిట మృత్యుపాశమైంది. తిరిగి రాని లోకాలకు వెళ్లేలా చేసింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదలిపై అనుమానం పెంచుకున్న బావ యువతిని అంతమొందించాడు. ఈ ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఏవీబీపురంలో చోటు చేసుకుంది.

women murder  avb puram in kukatpally
కూకట్​పల్లిలోని ఏవీబీపురంలో మరదలిని హత్య చేసిన బావ
author img

By

Published : Apr 12, 2021, 8:42 PM IST

ప్రేమించిన మరదలిపైనే అనుమానం పెంచుకున్నాడు ఓ దుర్మార్గుడు. అదే అక్కసుతో గొంతు నులిమి ఆ యువతిని హత్య చేశాడు. హైదరాబాద్​ కూకట్​పల్లిలోని ఏవీబీపురంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే...

కూకట్‌పల్లి హబీబ్​నగర్​లో నివాసముండే సోమేశ్వరరావు చిన్న కూతురు మంజుల(19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. ఏవీబీపురంలో నివసించే భూపతి(21) బీటెక్ రెండో సంవత్సరంలో చదువు ఆపేసి ఇంట్లో ఉంటున్నాడు. మంజులకు భూపతి బావ వరస అవ్వటంతో ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. కొంతకాలంగా యువతిపై అనుమానం పెంచుకుని ఆమెతో తరచు గొడవ పడేవాడు. శనివారం మధ్యాహ్నం మాట్లాడుకుందామంటూ యువతిని తన గదికి రప్పించుకున్నాడు. అక్కడే ఇద్దరికి గొడవ జరగటంతో గొంతు నులిమి మంజులను చంపేశాడు భూపతి.

women murder  avb puram in kukatpally
నిందితుడు భూపతి

మృతదేహాన్ని నీటిసంపులో పడేశాడు..

హత్య విషయం బయటకు రాకూడదని మృతదేహాన్ని నీటి సంపులో పారేసిన భూపతి... భయంతో అదే రోజు సాయంత్రం పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండుకు పంపారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: డబుల్​ బెడ్​ రూం ఇల్లు పేరుతో కార్పొరేటర్​ అనుచరుడి మోసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.