woman missing in SR Nagar : మొదటి భర్త, పిల్లలను వదిలిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవల అదృశ్యమైన ఓ మహిళ ఎట్టకేలకు ఎస్సార్‌నగర్ ఠాణా చేరింది. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహిళ(35)కు హనుమకొండకు చెందిన వ్యక్తి(43)తో 23 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు(16), కుమార్తె(13) ఉన్నారు. కొంతకాలం కిందట అమలాపురానికి చెందిన వ్యక్తితో పరిచయం కాగా.. ప్రేమకు దారి తీసింది.
Husbands Search for Wife : గతేడాది ఆగస్టు 20న ఇంట్లో నుంచి 10 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.లక్ష నగదు తీసుకుని వెళ్లిన ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుని బల్కంపేటలో ఉంటోంది. అయితే మొదటి భర్త తన భార్య నగలు, నగదు తీసుకుని వెళ్లిపోవడంతో హనుమకొండ సుబేదారి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సుబేదారి పోలీసులు మహిళతో పాటు ఆమె రెండో భర్తను అరెస్టు చేసి, జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చాక రెండో భర్తతో కలిసి బల్కంపేటలో ఉంటోంది. ఇటీవల ఆమె అదృశ్యం కావడంతో అతను ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఆచూకీ కోసం మొదటి భర్త, రెండో భర్త గాలించారు.
Two Husbands Search for Wife : మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు మహిళ ఆచూకీ కోసం వెతికారు. శనివారం ఆ మహిళ తన రెండో భర్తతో కలిసి ఎస్సార్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చింది. ఎక్కడికి వెళ్లావని పోలీసులు అడిగితే ఆమె సరైన సమాధానం చెప్పడం లేదు. ఆ ఒక్కటీ మాత్రం అడగొద్దని చెపుతుంది. తనకు మొదటి భర్త లేడని, పిల్లలు కూడా తన పిల్లలు కారని ఆమె చెప్తోంది. మొదటి భర్త కూడా గాలిస్తున్నందున రెండో భర్తతో కలిసి మహిళే అదృశ్యమైనట్లు నాటకం ఆడుతోందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి: vikarabad si dead in accident: పెళ్లైన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి