ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో అపర్ణ అలియాస్ శ్వేత పరిచయమైంది. తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని.. రూ.7 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని తెలిపింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకునేందుకు డబ్బులు కావాలని నమ్మించింది. అంతా నిజమేనని నమ్మిన బాధితుడు రెండేళ్లలో విడతల వారీగా రూ.46 లక్షలు పంపించాడు.
అనంతరం ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మహిళను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి 5 సెల్ఫోన్లు, ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శ్వేత సులభంగా డబ్బు సంపాదించడానికి ఫేస్‌బుక్‌లో రిక్వెస్టులు పెట్టి యువకులకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: