Woman Dies Due To Electric Shock: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన మహిళపై విద్యుత్ తీగలు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జమ్మలమడుగు మండలం పెద్ద దండ్లూరులో తిప్పయ్య గారి సువర్ణ (40) వరి పంటలో కలుపు పనులు చేసేందుకు వెళ్లారు. పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా.. 11కేవీ విద్యుత్ తీగ పడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బాధితురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: ప్రాణం తీసిన ఆర్ఏంపీ వైద్యం.. ఇంజక్షన్ వికటించి యువకుడు మృతి