ETV Bharat / crime

కి'లేడీ': ముచ్చటగా మూడో పెళ్లి.. రూ. 6 లక్షలతో ఉడాయింపు! - తిరుపతిలో ప్రేమపేరుతో మోసం చేసిన మహిళ

అనాథ అయితేనేం.. అమ్మాయి నచ్చింది. కలిసి బతకాలని నిర్ణయించుకున్నాడు. కన్నవారిని ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ఇష్ట సఖి పెళ్లికి ముందు అప్పులు చేశానని కన్నీరు పెడితే కరిగిపోయాడు. లక్షల సొమ్ము అందించాడు. ఇదే తీరు కొనసాడంపై అనుమానం వచ్చిన ఆ భర్త.. ఆరా తీస్తే తాను మూడో భర్తనని తెలుసుకుని షాక్ కు గురయ్యాడు. ఇదంతా ఎక్కడ జరిగింది.. ఆ కి'లేడీ' ఎవరు?

cheating in the name of love
అనాథనంటూ వల, ప్రేమ పేరుతో మహిళ మోసం
author img

By

Published : Jun 13, 2021, 8:39 AM IST

Updated : Jun 13, 2021, 2:28 PM IST

తాను అనాథనని నమ్మించి మూడో పెళ్లి చేసుకుంది. వివిధ కారణాలు చెప్పి యువకుడి నుంచి లక్షల్లో దండుకొని పరారైంది. ఈ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి ఎస్సై పరమేశ్‌నాయక్‌ కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు (29) ఐదేళ్లుగా మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తూ తిరుపతి సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పని చేసే ఎం.సుహాసిని (35)తో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సుహాసిని అనాథ అని చెప్పి అతనితో స్నేహం చేసింది. ఆమెను నమ్మిన యువకుడు... కుటుంబ సభ్యులను ఒప్పించి గతేడాది డిసెంబరులో పెళ్లి చేసుకున్నాడు.

cheating in the name of love
అనాథనని నమ్మించి మూడో వివాహం

తనవారికి బాగాలేదంటూ...

ఆ సమయంలోనే యువతికి 8 తులాల బంగారు నగలు పెట్టారు. ‘నన్ను చిన్నప్పటి నుంచి ఆదరించిన వారికి ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందు అప్పులు చేశాను’ అంటూ ఆమె యువకుడి నుంచి వివిధ రూపాల్లో రూ.4 లక్షలు తీసుకుంది. అంతేకాక తన తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుందని తెలియడంతో యువకుడు ఈ నెల 7న ఆమెను నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మరుసటి రోజు నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఇంట్లో యువతి ఆధార్‌కార్డు లభించింది.

అనాథనని నమ్మించి మూడో వివాహం

అసలు విషయం బయటపడిందిలా...

ఆధార్ ఆధారంగా ఆరా తీయగా.. నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన వ్యక్తితో ఆమెకు వివాహమై ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది. ఈలోగా సుహాసిని ఆ యువకుడికి ఫోన్‌ చేసింది. ‘నేను హైదరాబాద్‌లో ఉన్నా. త్వరలో నీ డబ్బులు ఇచ్చేస్తా. పోలీసులను ఆశ్రయిస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించింది. ఏడాదిన్నర కిందట రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఫొటోలనూ యువకుడికి పంపింది. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు.

ఇదీ చదవండి: మాంసం కోసం కిరాతకం.. ప్రాణంతో ఉన్న పాడిగేదెల తొడలు కోసి..!

Last Updated : Jun 13, 2021, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.