ETV Bharat / crime

వాహనాలు ఆపుతున్న వ్యక్తులు ఎవరు..? అసలేందుకు అపుతున్నారు..? - ETV surveillance

Transport Officer Collecting Money Illegally: కొందరు అధికారుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండాపోతోంది. ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన ఓ రవాణా శాఖ అధికారి ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటుచేసుకొని, అర్ధరాత్రి నడిరోడ్డుపై అక్రమవసూళ్లకు పాల్పడుతున్న ఘటన ఈటీవీ నిఘాలో బట్టబయలైంది. ప్రలోభాలకు లొంగని ఈటీవీ ప్రతినిధిపై సదరు అధికారి చివరకు బెదిరింపులకు దిగడం కొసమెరుపు.

Transport Officer Collecting Money Illegally

author img

By

Published : Nov 15, 2022, 3:04 PM IST

వాహనాలు ఆపుతున్న వ్యక్తులు ఎవరు..? అసలేందుకు అపుతున్నారు..?

Transport Officer Collecting Money Illegally: అదే జిల్లా, అదే ఊరు, అదే ప్రదేశం, అదే బాధితులు.. కేవలం అక్రమ వసూళ్లకు పాల్పడే వ్యక్తులు మారారు. మిగతా అంతా సేం టూ సేం. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో, 44జాతీయ రహదారిపై ఉన్న టోల్‌గేట్ వద్ద రేడియం స్టిక్కర్ల పేరిట సాగుతున్న అక్రమ వసూళ్లను, ఈటీవీ తెలంగాణ గతనెలలో వెలుగులోకి తెచ్చింది. నెలన్నర గడవకముందే అక్కడే మరో కొత్త తరహా దందా మొదలైంది. అప్పుడు పోలీసుశాఖ వంతుకాగా, ఈసారి రవాణాశాఖ వంతు.

తూప్రాన్ టోల్‌గేట్ వద్ద రాత్రి సమయాల్లో మళ్లీ వాహనాలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఈటీవీ- ఈనాడు నిఘా పెట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే మార్గంలో టోల్‌గేట్ దాటగానే రోడ్డు మధ్యలో నలుగురు నిలబడి చేతిలోని టార్చిలైట్‌తో డ్రైవర్ల కళ్లలోకి ఫోకస్‌ కొట్టి వాహనాలు ఆపుతున్నారు. తనీఖీల పేరిట పత్రాలు పరిశీలించి, సరైనవి లేని వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.

రోడ్డు పక్కన ఓ ఇన్నోవా వాహనంలో కూర్చున్న రవాణాశాఖ అధికారి మహమ్మద్ అఫ్రోజ్, కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. వాహనాలు ఆపుతున్న వ్యక్తులు ఎవరు? ఎందుకు అపుతున్నారని రవాణాశాఖ అధికారి మహమ్మద్ అఫ్రోజ్​ను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. వీడియో చిత్రీకరణను గమనించిన ప్రైవేట్‌ వ్యక్తులు అక్కడినుంచి మెల్లిగా జారుకున్నారు.

ఏదైనా ఉంటే చూసుకుందాం వీడియో మాత్రం తీయవద్దని ఈటీవీ ప్రతినిధిని, సదరు అధికారి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం సైతం చేశారు. తన ప్రలోభాలకు లొంగకపోవడంతో, ఏకంగా బెదిరింపులకు దిగాడు. సెల్‌ఫోన్​లో వీడియో తీస్తూ, ఐడీ కార్డు చూపించూ.. పోలీసు కేసుపెడతా అంటూ భయపెట్టే ప్రయత్నం చేశాడు. తూప్రాన్ టోల్‌గేటుతో పాటు పట్టణ శివారులోని గీతా హైస్కూల్ వద్ద మూడునెలలుగా ప్రైవేట్‌వ్యక్తులతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

మహమ్మద్ అఫ్రోజ్ఇ సుక, మట్టి వ్యాపారులతో, నెలనెల మామూళ్లు పెద్దఎత్తున దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా రవాణాధికారి శివలింగయ్యను ఆ అంశంపై ఫోన్‌లో వివరణ కోరగా ప్రైవేట్‌ వ్యక్తులతో తనిఖీలు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో వాహనాల తనిఖీలకు మహమ్మద్ అఫ్రోజ్​ను టాస్క్‌ఫోర్స్‌ అధికారిగా నియమించినట్లు తెలిపారు. విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేడియం స్టిక్కర్ల పేరిట పోలీసుల అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనాన్ని ఈటీవీ వెలుగులోకి తెచ్చినా ఉన్నతాధికారుల చర్యలు శూన్యం. ప్రస్తుతం ఈ అంశంలోనూ, ఇదే పునరావృతం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.