ETV Bharat / crime

MURDER: దుర్భాషలాడుతున్నాడని తండ్రినే కడతేర్చాడు! - telangana latest news

కుటుంబసభ్యులను నిత్యం దుర్భాషలాడుతూ గొడవపడుతున్నాడని ఓ కుమారుడు సొంత తండ్రినే కడతేర్చాడు. మతిస్థిమితం సరిగా లేని ఆ తండ్రి తలపై కర్రతో బాది అంతమొందించాడు. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో చోటుచేసుకుంది.

దుర్భాషలాడుతున్నాడని తండ్రినే కడతేర్చాడు!

author img

By

Published : Jun 8, 2021, 3:59 AM IST

మేడ్చల్​-మల్కాజిగిరి జిల్లా కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నిత్యం దుర్భాషలాడుతున్నాడని మతిస్థిమితం సరిగా లేని తండ్రిని కుమారుడు హత్య చేశాడు.

రాజీవ్​గాంధీ నగర్​లో నివసించే మహమ్మద్ ఇంతియాజ్(55) గతంలో ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేశాడు. పది సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇంతియాజ్​కు మతిస్థిమితం సరిగా ఉండటం లేదు. తరచూ ఇంట్లో వారిని అకారణంగా దూషిస్తూ ఉండేవాడు.

ఇంతియాజ్​ ఆదివారం రాత్రి అతడి పెద్దకొడుకు సలావుద్దీన్ భార్యను తిట్టి, ఇంట్లో గొడవ చేశాడు. రాత్రి ఇంటికి వచ్చిన సలావుద్దీన్ ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకొని తమ్ముడితో కలిసి తండ్రి నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. ఆవేశంతో తండ్రిపై దాడికి పాల్పడ్డాడు. సలావుద్దీన్​ సోదరుడు అతడిని అడ్డుకుని తండ్రిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: భర్తను కడతేర్చిన భార్య.. భూ వివాదమే కారణమా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.