ETV Bharat / crime

'అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి' - shooting incident latest crime news

shooting incident: అమెరికాలో దారుణం జరిగింది. మేరీల్యాండ్‌ సిటీలో నివాసం ఉంటున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​పై నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు. ఈఘటనలో అతను అక్కడిక్కడే మృతిచెందాడు.

నక్క సాయిచరణ్
నక్క సాయిచరణ్
author img

By

Published : Jun 22, 2022, 11:51 AM IST

shooting incident: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. మేరీల్యాండ్‌ నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నల్గొండ యువకుడిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నల్గొండ వాసి నక్క సాయి చరణ్‌(26) మృతి చెందాడు. మార్నిగ్ వాక్ కోసం కారు దిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతనిపై ఆదివారం కాల్పులు జరపగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాయిచరణ్ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడని మృతుడి తండ్రి నరసింహ తెలిపారు. సిన్సినాటి వర్శిటీలో ఎంఎస్ పూర్తిచేశాడని.. ఆరునెలలుగా సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా విధులు నిర్వహిస్తున్నాడని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే సాయిచరణ్‌ కారు కొన్నాడని మార్నింగ్ వాక్​ కోసం వెళ్తుండగా ఈఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి మరణవార్త సోమవారం రాత్రి తెలిసిందని పేర్కొన్నారు. నవంబర్​లో ఇంటికి వస్తానని ఈనెల 17న చివరిసారిగా మాట్లాడానని చెబుతూ బోరున విలపించారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వస్థలానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని నరసింహ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మృతుడి కుటుంబాన్ని పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు.

ఇదీ చదవండి: పెళ్లిపేరుతో యువకుడికి వల.. రూ.6.5 కోట్లు స్వాహా

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 12 వేలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.