హైదరాబాద్ (Hyderabad) చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభాత్నగర్కు చెందిన ఇద్దరు చిన్నారులు (Sister and Brother missing) అదృశ్యమయ్యారు. ఈనెల 3న ఆడుకోడానికని ఇంటి నుంచి వెళ్లిన సిరి(14), ఉమాకాంత్(12) తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు… తెలిసిన వాళ్లు, బంధువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ దొరకలేదు. వీరి సొంతూరు యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ మండలం వెంకీర్యాల. ఆడుకోడానికి వెళ్లిన పిల్లలు కనిపించకుండా పోవడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ (Sister and Brother missing) కేసుగా నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: girl missing: తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో బాలిక అదృశ్యం