విశాఖ జిల్లా పాడేరు గ్రంథాలయం రోడ్డుపై ఓ తల్లి శునకం నడుచుకుంటూ వెళ్తోంది. తన వెంటనే పిల్ల శునకం ఆడుకుంటూ నడుస్తోంది. అయితే హఠాత్తుగా ఓ వాహనం.. పిల్ల కుక్కను ఢీ కొట్టిడం వల్ల అక్కడకక్కడే చనిపోయింది. తన బిడ్డ.. వెనకే వస్తుందనుకున్న తల్లికి.. పిల్ల విగతజీవిగా ఉండిపోవడం చూసి తల్లడిల్లిపోయింది.
దగ్గరికి వెళ్తే అయిన వస్తుందేమోననుకున్నా నిరాశే ఎదురైంది. ఏం చేయాలో తెలియని తల్లి శునకం.. అటు.. ఇటు తిరగసాగింది. కోపంతో రోడ్డుపైన వెళుతున్న వాహనదారులను బెదిరించింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు చలించిపోయారు.
ఇవీచూడండి: భర్తపై అలిగి కుమార్తెతో సహా ఎస్సారెస్పీలో దూకిన మహిళ