నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో అన్నను సొంత తమ్ముడే అతి కిరాతకంగా చంపాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇటీవలే విదేశాల నుంచి సొంత ఊరికి వచ్చాడు. శుక్రవారం రాత్రి తమ్ముడు నరేందర్‌తో ఆస్తి విషయంలో గొడవకు దిగాడు.
ఇద్దరి మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో క్షణికావేశానికి గురైన నరేందర్.. శ్రీనివాస్ ముఖంపై కర్రతో గాయపరిచాడు. అనంతరం ఛాతీ, గొంతూపై కాలితో తొక్కి హత్య చేశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కాగజ్‌నగర్‌లో దొంగల చేతివాటం.. ఏడున్నర తులాల బంగారం చోరీ