Medchal Road Accident Today : మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. ప్రతాప్‌రెడ్డి.. కొంపల్లి నుంచి మెదక్ జిల్లా తూప్రాన్ వెళ్తుండగా మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధి అత్వెల్లి వద్ద జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఓ వ్యక్తిని ఢీకొట్టింది. ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు మేడ్చల్ జిల్లా కేంద్రానికి చెందిన నర్సింహులుగా గుర్తించారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు.. గుండెలవిసేలా రోదించారు. ఇప్పుడే వస్తానని చెప్పి బయటకొచ్చావు.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ వారు రోదించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
అక్కడే ఉన్న వంటేరు ప్రతాప్‌రెడ్డి వారిని ఓదార్చారు. అండగా ఉంటామని.. ఆదుకుంటామని బాధిత కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. వాహనం అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..
వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. అంతలోనే ఒక్కటిగా వెళ్లిపోయారు
నడిరోడ్డుపై చితకబాది యువకుడి కిడ్నాప్‌నకు యత్నం.. మహిళ ధైర్య సాహసాలతో లక్కీగా..!
గుడిసె కాలిపోయి తల్లీకూతుళ్లు సజీవ దహనం.. అధికారులే నిప్పంటించారన్న స్థానికులు