ETV Bharat / crime

attack with knife: తాగేందుకు అనుమతించలేదని కత్తితో వీరంగం.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - కత్తితో దాడి

attack with knife: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తాగేందుకు రెస్టారెంట్లో అనుమతి ఇవ్వలేదని బీభత్సం సృష్టించాడు. రోడ్డుపైనే ఉన్న మరో వ్యక్తిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

attack with knife
తాగేందుకు అనుమతించలేదని కత్తితో వచ్చి దాడి
author img

By

Published : Dec 26, 2021, 4:02 PM IST

attack with knife నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లో శనివారం రాత్రి కత్తి పోట్ల ఘటన కలకలం రేపింది. మద్యం మత్తుతో ఓ యువకుడు మరో వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. స్థానిక రెస్టారెంట్లో మద్యం తాగేందుకు అనుమతి లేదని నిర్వాహకులు వారించడంతో దారుణానికి ఒడిగట్టాడు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

attack at armoor: రాజారామ్​నగర్​కు చెందిన లకన్ అనే యువకుడు తాగిన మత్తులో ప్రఫుల్ అనే వ్యక్తిని పొడిచేశాడు. మొదట అతను స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో మద్యం తాగేందుకు యత్నించాడు. నిర్వాహకులు అనుమతి నిరాకరించడంతో వీరంగం సృష్టించాడు. రోడ్డుపైకి వచ్చి చేతిలో ఉన్న కత్తితో దారుణానికి పాల్పడ్డాడు. కత్తి పోట్లకు గురైన ప్రఫుల్​ని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రఫుల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

తాగేందుకు అనుమతించలేదని కత్తితో వీరంగం

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.