రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాజేశ్వర్ మార్బుల్ షాప్ పక్కన ఆగిన టిప్పర్‌ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న మస్తాన్(38), చంద్రయ్య(62) తీవ్రంగా గాయపడ్డారు.
మస్తాన్ అక్కడిక్కడే మృతి చెందగా, చంద్రయ్య వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: DRUNKEN DRIVE: మద్యం మత్తులో లారీ డ్రైవర్.. అరగంట పాటు బీభత్సం