మిర్చి లోడుతో వెళ్తున్న లారీ విద్యుదాఘాతానికి గురైన దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. చంద్రుగొండ మండలం అన్నారుగూడెం సమీపంలో మిర్చి బస్తాలతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు రావడంతో లారీతో సహా మిర్చి దగ్ధమైంది.
ఘటనాస్థలికి సమీపంలోనే ఆరబోసిన మిర్చి కుప్పకు మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పంట పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా మిర్చి పంట అంతా కాలి బూడిదైందని.... రూ.12 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోతున్నారు.