ETV Bharat / crime

తండ్రి ఫోన్ మాట్లాడొద్దన్నాడని.. బాలిక ఆత్మహత్య - మైనర్ బాలిక ఆత్మహత్య

చరవాణి వాడకంపై తండ్రి మందలించాడని మనస్తాపంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వాళ్లు తెలంగాణ నుంచి కర్నూలు జిల్లా గాలేరు- నగరి కాలువ పనులకు వచ్చినట్లు తెలుస్తోంది.

girl suicide
తండ్రి ఫోన్ మాట్లాడొద్దన్నాడని.. బాలిక ఆత్మహత్య
author img

By

Published : Apr 23, 2021, 10:51 PM IST

ఫోన్ మాట్లాడుతున్నందుకు తండ్రి మందలించాడని మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటిపల్లె గాలేరు - నగరి సమీపంలో చోటు చేసుకుంది. మృతురాలు అనూష(15) తెలంగాణకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

పొట్టకూటికోసం గాలేరు - నగరి కాలువ లైనింగ్ పనులు చేసేందుకు తండ్రి రాములుతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గురువారం యువతి గాలేరు - నగరి కాలువ సమీపంలో కాలిపోయి శవమై కనిపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో విచారించగా అసలు విషయం బయటపడింది. నిన్న రాత్రి.. వారు నివసిస్తున్న గుడిసెలో ఎవరూ లేని సమయంలో ఓ చెంబులో డీజిల్ తీసుకెళ్లి నిప్పంటించుకున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: నగ్న వీడియోలతో ఫోన్​ చేసింది.. ఆ తర్వాత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.