ETV Bharat / crime

'పెళ్లి చేయండి.. లేదంటే సెల్​టవర్ పైనుంచి దూకి చనిపోతా..!' - కరీంనగర్ జిల్లా

కోరుకున్న అమ్మాయి తనకు దక్కదేమోనని మనస్తాపం చెందాడు ఓ మైనర్ ప్రేమికుడు​. సెల్ టవర్ ఎక్కి.. దూకేస్తానంటూ హల్​చల్​ చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

'పెళ్లి చేయండి.. లేదంటే సెల్​టవర్ పైనుంచి దూకి చనిపోతా..!'

author img

By

Published : Feb 7, 2021, 10:09 PM IST

తను ప్రేమించిన యువతిని.. తనకు దూరం చేస్తున్నారంటూ ఓ మైనర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. జంగపల్లికి చెందిన మైనర్​కు ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు.. వారి వివాహానికి అంగీకరించలేదు.

మనస్తాపానికి గురైన అబ్బాయి సెల్ టవర్ ఎక్కి.. దూకేస్తానంటూ హల్​చల్​ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మేజర్​ అయితే తామే దగ్గరుండి వివాహం జరిపించేవారిమని వివరించారు. సాయంత్రం దాకా నానా హైరానా చేసిన ప్రేమికుడు.. ఎట్టకేలకు దిగి వచ్చాడు. ఇరువురి తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఇదీ చదవండి: పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.