ETV Bharat / crime

సన్నబడాలని వేధించటంతో వివాహిత ఆత్మహత్య, భర్త అరెస్ట్

సన్నగా ఉండాలనే భర్త కోరికకు ఓ భార్య బలై పోయింది. లావుగా ఉన్నావని.. సన్నబడాలని అతని వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్​​ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

wife suicide due to diet torture
భర్త వేధింపులకు భార్య ఆత్మహత్య
author img

By

Published : Mar 10, 2021, 4:01 PM IST

Updated : Mar 10, 2021, 9:00 PM IST

సన్నబడాలనే భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగింది. మల్లంపేటకు చెందిన కానిస్టేబుల్ శివ కుమార్​ సనత్​నగర్​ పీఎస్​లో విధులు నిర్వహిస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం శ్రీలత(28)తో వివాహం జరిగింది. పెళ్లైన రెండేళ్లకు అదనపు కట్నం తేవాలని ఆమెను వేధించాడు. శ్రీలత తల్లిదండ్రులు కొంత డబ్బును ఇచ్చారు. దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మళ్లీ వేధింపులకు గురిచేశాడు.

ఇటీవల లావయ్యావని.. తగ్గడానికి మరో రూ.5 లక్షలు తీసుకురావాలని శ్రీలతను వేధించడం ప్రారంభించాడు. మనస్తాపం చెందిన బాధితురాలు దుండిగల్ పరిధిలోని పోచంపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

శ్రీలత

ఇదీ చదవండి: సంగారెడ్డి హత్య కేసును ఛేదించిన పోలీసులు

Last Updated : Mar 10, 2021, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.