ETV Bharat / crime

మైనర్​ బాలికతో నాల్గోపెళ్లి..బలవంతంగా అత్యాచారం - rape on minor girl news

ముగ్గురిని వివాహం ఆడిన ఓ వ్యక్తి.. మరో 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మాయమాటలతో పెళ్లి చేసుకొని చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

rape on minor, mahabubnagar
బాలికపై అత్యాచారం, మహబూబ్​నగర్​
author img

By

Published : Mar 27, 2021, 12:20 PM IST

మాయమాటలు చెప్పి బాలికను వివాహం చేసుకొని అత్యాచారం చేసిన మూడు పెళ్లిళ్ల ప్రబుద్ధుడిని మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని సద్దలగుండుకు చెందిన ఎండి సాజిద్​ గతంలో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. వారివురి మధ్య గొడవలు తలెత్తడంతో మూడో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక సంతానం కలిగింది. జీవనోపాధి కోసం భార్యతో కలిసి దేవరకద్ర మండలం చౌదర్​పల్లిలో కూలీపనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆ సమయంలో ఓ బాలికతో సాజిద్​కు పరిచయం ఏర్పడింది. దాంతో ఆమెతో చనువు పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

పథకం వేసి..

పథకం ప్రకారం ఈ నెల 12న సాయంత్రం తన ముగ్గురు స్నేహితుల సాయంతో బాలికను ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఓ ప్రదేశానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సాజిద్​ తల్లికి విషయం చెప్పింది. ఆమె పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాజిద్​తో పాటు అతని తల్లి, స్నేహితులను నిందితులుగా చేర్చారు. అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. బాధితురాలిని తల్లిదండ్రుల అనుమతితో స్టేట్ హోమ్ లో ఉంచారు.

ఇదీ చదవండి: భూ వివాదంలో న్యాయవాది.. ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.