వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన ఎర్రవల్లి మల్లేశం (32) అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన సందపురం రాజు కత్తితో దాడి చేశాడు. బాధితుడుని 108 వాహనంలో తాండూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
పాత కక్షలతోనే దాడికి పాల్పడ్డినట్లు స్థానికంగా సమాచారం తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్ చేసేస్తారు'