జోగులంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మర్లబీడు గ్రామానికి చెందిన చిన్న రంగారెడ్డి (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన సోదరుడుని భార్య, మేనల్లుడు హత్య చేశారని రంగారెడ్డి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసుకున్న పోలీసులు క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం తలవెనుక భాగంలో బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య, మేనల్లుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరీంనగర్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..!