Suicide at New Bowenpally : సమీప బంధువు భార్యతో సహజీవనం చేస్తూ చుట్టాల నుంచి ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి ఎస్సై రాజు వివరాల ప్రకారం.. కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత్(37) రెండేళ్లుగా న్యూబోయిన్‌పల్లి బాపూజీనగర్‌లో ఉంటూ ఓ రిహబిలిటేషన్ కేంద్రంలో పనిచేస్తున్నాడు. తన సమీప బంధువు భార్య(28)ను స్వగ్రామం నుంచి తీసుకొచ్చి బాపూజీనగర్‌లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు.
గురువారం రాత్రి తమ్ముడు హరీంద్ర ఆకాశ్‌తో కలిసి మద్యం తాగాడు. ఇంటికొచ్చి ఉక్కపోతగా ఉందని బంగ్లా పైకి వెళ్దామని సహజీవనం చేస్తున్న మహిళతో చెప్పాడు. ఆమె బయటకు వెళ్లగానే లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. పిలిచినా తలుపులు తెరవకపోవడంతో ఆమె హరీంద్రకు ఫోన్ చేసింది. అతను వచ్చి వెంటిలేటర్ నుంచి చూసేసరికి సంజీత్ కిటికీకి ఉరేసుకొని కనిపించాడు. హరీంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సహజీవనం విషయమై బంధువుల ఒత్తిడి ఎక్కువవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇవీ చూడండి: పరీక్ష రాసి వస్తుండగా.. పదో తరగతి విద్యార్థిపై హత్యాయత్నం!