ETV Bharat / crime

Suicide: అందీ అందని ఆశయం.. ఐఏఎస్‌ కాలేక విరక్తితో ఆత్మహత్య

ఇటు వయసు మీరిపోతోంది.. అటు ఉద్యోగంపై పెట్టుకున్న కలలు నెరవేరడంలేదు. లక్ష్యం అందినట్టే అంది తీరా దొరక్కుండాపోతోంది. ఏళ్ల తరబడి నిరీక్షించి.. విసిగిపోయి చివరకు ఉసురు తీసుకున్నారు(suicide). నిజామాబాద్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

a man Suicide, Suicide due to not become ias officer
ఐఏఎస్‌ కాలేక విరక్తితో ఆత్మహత్య, నిజామాబాద్‌లో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Aug 25, 2021, 9:22 AM IST

ఐఏఎస్‌(IAS) కావాలన్నది ఆయన జీవితాశయం. వయసు పెరిగిపోతుండటం..లక్ష్యం అందినట్టే అంది దూరమవుతుండటంతో జీవితంపై ఆశ చంపేసుకున్నారు. చివరికి బలవన్మరణానికి పాల్పడ్డారు(Suicide). నిజామాబాద్‌లోని వివేకానందనగర్‌ కాలనీ వాసి శ్రీనివాస్‌(42) పీహెచ్‌డీ(ph.d) పూర్తి చేశారు. ఐఏఎస్‌ కావాలనే ఆశయంతో ఏళ్ల తరబడి దిల్లీలో ఉండి శిక్షణ తీసుకున్నారు. రెండుసార్లు ముఖాముఖి(interview) వరకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

ఇటీవల బంధువుల్లో ఒకరికి ఐఏఎస్‌ రావడంతో.. మరింత కుంగిపోయారు. ఇదే కారణంతో గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో బతికి బయటపడ్డారు. మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నిజామాబాద్‌ నాలుగో ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: Bus Accident: బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.