ETV Bharat / crime

బావపై బావమరిది హత్యాయత్నం... భార్యతో వెళ్తుండగా అడ్డగించి..! - తెలంగాణ వార్తలు

ముసారాంబాగ్ చౌరస్తాలో దారుణం చోటుచేసుకుంది. హాబీబ్ అనే వ్యక్తిపై అతడి బావమరిది మోసిన్ హత్నాయత్నం చేశాడు. హాబీబ్ తన భార్యతో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నిందితుడు ఈ ఘటనకు ఒడిగట్టాడు. చికిత్స కోసం బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

a-man-stabbed-and-tried-for-murder-on-his-at-masambhagh-in-hyderabad
బావపై బావమరిది హత్యాయత్నం... భార్యతో వెళ్తుండగా అడ్డగించి..!
author img

By

Published : Mar 20, 2021, 1:39 PM IST

హైదరాబాద్​లోని మలక్​పేట పోలీసు స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో హాబీబ్ అనే వ్యక్తి పై అతని బావమరిది మోసిన్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. హాబీబ్​ తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా మోసిన్ దాడి చేశాడు. సమాచారం అందుకున్న మలక్​పేట పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న హాబీబ్​ను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ తగాదాలే ఈ దాడికి ప్రధాన కారణమని వెల్లడించారు. ప్రస్తుతం హాబీబ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ పేలి... రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.