వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగేళ్ల కుమారుడితో సహా తండ్రి అదృశ్యం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. గాంధీ కాలనీకి చెందిన మోనగారి కార్తిక్, తన నాలుగేళ్ల కుమారున్ని తీసుకొని మూడు రోజులుగా కనిపించకుండాపోయారు. సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తానని చెప్పి... ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
స్థానికంగా గాలించినా ఫలితం లేదని వాపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. తన కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన భార్యకు, మామకు మెసేజ్ పంపినట్లు వెల్లడించారు. ఈ సందేశంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
లాక్‌డౌన్ కంటే ముందు కార్తిక్ బెంజ్ కార్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్ ఉద్యోగం చేసేవారని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: saidabad incident: రాజు ఎక్కడున్నాడు? తప్పించుకోవడానికి సహకరించింది ఎవరు?