ETV Bharat / crime

ఆధార్​లో పేరు మార్చాడు.. జైలు పాలయ్యాడు - తెలంగాణ వార్తలు

గత లాక్​డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయాడు. అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లి మూడు లక్షలు ఖర్చు చేశాడు. ఓ పక్క ఉపాధి పోయి మరోపక్క అప్పులు పాలవటంతో డీఆర్డీవో శాస్త్రవేత్త భూమిని కాజేసేందుకు ప్రయత్నించి జైలుపాలయ్యాడో వ్యక్తి.

ఆధార్​లో పేరు మార్చాడు.. జైలు పాలయ్యాడు
ఆధార్​లో పేరు మార్చాడు.. జైలు పాలయ్యాడు
author img

By

Published : Jun 11, 2021, 10:59 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం భానూరు గ్రామానికి చెందిన వెంకటేశం గత లాక్​డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయాడు. దీనికితోడు అతని గుండె, మూత్రపిండాలు దెబ్బతినటంతో ఆస్పత్రిలో చేరి మూడు లక్షలు ఖర్చు చేశాడు. ఓ పక్క ఉపాధి పోయి, మరోపక్క అప్పులపాలయ్యాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో బాచుపల్లికి చెందిన డీఆర్డీవో శాస్త్రవేత్త హనుమంతరావు 497 సర్వేనెంబర్​లో 20 గుంటల భూమిని అమ్మాలకున్నారు. ఈ విషయం తెలుసుకున్నవెంకటేశం బ్రోకర్ ద్వారా ఆ భూమి పత్రాలు తీసుకున్నాడు.

గత మార్చిలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​కు చెందిన తన బంధువు గుర్రం పాండు వద్దకు వెళ్లి, పింఛన్ ఇప్పిస్తానని ఆధార్ కార్డు ఇవ్వాలన్నాడు. పాండు, అతని ఆధార్​ కార్డు తీసుకుని నల్గొండ జిల్లా చండూరులోని ఓ ఇంటర్నెట్ సెంటర్​కి వెళ్లి ఆధార్​లో ఉన్న పాండు పేరును హనుమంతరావుగా మార్పించాడు. అనంతరం కూకట్​పల్లి వచ్చి ధరణి పోర్టల్​లో పాస్ పుస్తకం కోసం ఆధార్​తో దరఖాస్తు చేశాడు. అదే సమయంలో శాస్త్రవేత్త హనుమంతరావు చనిపోవటంతో ఆయన భార్య కనకదుర్గ కూడా భూ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుర్తించిన రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం తెలిసింది. నిందితుడు వెంకటేశంను అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపారు.

ఇదీ చదవండి: లేడీ డాక్టర్​ పేరుతో లవ్​ ప్రపోజల్​.. 24 లక్షలు ఖల్లాస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.