కొవిడ్ నుంచి కోలుకున్న వారిపై బ్లాక్‌ఫంగస్ ముప్పు ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బీల్యానాయక్కు తండా శివారు బొడతండాకు చెందిన ఓ వ్యక్తి కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
గ్రామానికి చెందిన శ్రీను (47) గత నెలలో కొవిడ్ బారిన పడ్డాడు. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఇంటికెళ్లిన మూడు రోజులకు అస్వస్థతకు గురయ్యాడు. మే 28న ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా.. వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధరించారు. చికిత్స కోసం కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: ధాన్యం లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలు