Car fire in Venkatapuram: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్‌లో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల్లో కాలిన వ్యక్తి భీమ్లా తండాకు చెందిన ధర్మగా గుర్తించారు. ఆయన హైదరాబాద్ సెక్రటేరియట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారని.. ఈ నెల 5న కుటుంబసభ్యులతో కలిసి తండాకు వచ్చారని తెలిపారు.
ఇటీవలే కారు కొని కార్యాలయంలో మిఠాయిలు పంచారని, అదే చివరి సారి చూశామని సహచర ఉద్యోగులు తెలిపారు. ధర్మాకు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతని భార్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. కుటుంబ సభ్యులు ఎవరిమీద అనుమానం లేదని పోలీసులకు తెలిపారు. దీంతో ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జార్జ్ తెలిపారు.
ఘటనా స్థలంలో పెట్రోల్ బాటిల్‌తో పాటు మృతునికి సంబంధించిన ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియాదర్శిని పరిశీలించారు.
"వెంకటాపుర్‌లో చెరువు గట్టుపై నుంచి కారు పడిపోయింది. కారులో ఉన్న వ్యక్తి మంటలు చెలరేగడంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాం. ఎవరని విచారణ చేస్తే ధర్మ అని గుర్తించాం. అతను సచివాలయ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని తెలిసింది. ఈ మృతి అనుమానాస్పదంగా ఉంది. అందువల్ల కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తాం. ఎందుకు ఇలా జరిగిందో అనే వివరాలు దర్యాప్తులో తెలిసిన తరవాత చెబుతాం." -జార్జ్, స్థానిక సిఐ
ఇవీ చదవండి: