ETV Bharat / crime

అతడి అదృష్టం అడ్డం తిరిగింది.. గొంతులో యాట బొక్క ఇరుక్కుని..!! - అదృష్టం అడ్డం తిరిగితే.. అరటిపండు తిన్నా పళ్లు విరుగుతాయంటా

"అదృష్టం అడ్డం తిరిగితే.. అరటిపండు తిన్నా పళ్లు విరుగుతాయంటా..!" వేదం సినిమాలో అల్లుఅర్జున్​ చెప్పే డైలాగ్ ఇది. అచ్చంగా అలాంటి మాటలే ఓ వ్యక్తి జీవితంలో నిజమయ్యాయి. అయితే ఇక్కడ అరటి పండుకు బదులు మటన్​ తిన్నాడు. పళ్లు విరగటానికి బదులు.. ఏకంగా ప్రాణాలేపోయాయి. అసలేంజరిగిందంటే..

a man died by stuck a meat bone in throat atrajanayak thanda

author img

By

Published : Apr 14, 2022, 1:43 PM IST

సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్​ తండాకు చెందిన భూక్య గోపి కుటుంబానికి ఇంటి దైవం ముత్యాలమ్మ. ఈనెల 12(మంగళవారం)న ముత్యాలమ్మకు కుటుంబమంతా కలిసి పండుగ చేశారు. అమ్మవారికి మేకను బలిచ్చి ఘనంగా వేడుక చేశారు. యాట మాంసాన్ని రుచికరంగా వండి.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అనంతరం అందరూ సహ పంక్తిగా కూర్చొని సంతోషంగా భోజనాలు చేస్తున్నారు. మసాలాల ఘుమఘుమలతో జిహ్వ లాగేస్తున్న మటన్​లో మంచిమంచి ముక్కలు తింటూ.. రుచిని ఆస్వాదిస్తున్నారు.

ఇంతలో.. భూక్య గోపి గొంతులో అనుకోకుండా మాంసం బొక్క ఇరుక్కుంది. అటు లోపలికి వెళ్లట్లేదు.. ఇటు బయటికి రావట్లేదు. ఊపిరి ఆడనివ్వట్లేదు. తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏదీ ఫలితమివ్వలేదు. ఉన్నాకొద్ది పరిస్థితి చేజారిపోతోంది. మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతుండగానే గోపి ఊపిరి ఆగిపోయింది. చిన్న మాంసపు బొక్క ఓ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి.. చివరికి ఆయువునే తీసేసింది. అంతవరకు ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్న కుటుంబం.. గోపి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది.

a man died by stuck a meat bone in throat atrajanayak thanda
గొంతులో బొక్క ఇరుక్కుని చనిపోయిన భూక్య గోపి

అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం గోపి పెద్ద కొడుకు భూక్య సురేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.