ATM Robbery in Nizamabad : ఏటీఎంలో చోరీకి పాల్పడుతూ ఓ దొంగ నిజామాబాద్ పోలీసులకు ఆదివారం పట్టుబడ్డాడు. నగరంలోని పద్మ నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చొరబడ్డాడు. అనుమానంతో స్థానికులు 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఏటీఎంలో దొంగతనానికి యత్నిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏం జరిగింది?
ATM theft news : అతని పేరు డిలోడ్ సునీల్. మాటలు రావు.. చెవులు వినబడవు. నిజామాబాద్ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిగా చేస్తున్న అతడు సునీల్ ఏకంగా స్థానిక పద్మనగర్ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించాడు. ఇనుపరాడ్డుతో యంత్రాన్ని ధ్వంసం చేశాడు. వెంటనే అలారం మోగింది. కానీ వినికిడి సమస్య వల్ల అతడికి ఆ శబ్దం వినిపించలేదు. అక్కడే ఉండి డబ్బు తీసే పనిలో ఉండిపోయాడు. శబ్దం విన్న స్థానికులు మేల్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కూడా అతడు చోరీ పనిలోనే తలమునకలై ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం