ETV Bharat / crime

దారుణం: హత్య చేసి.. ఫ్రిజ్‌లో పెట్టారు! - తెలంగాణ తాజా వార్తలు

ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్​లో ఉంచిన ఘటన హైదరాబాద్​ కార్మికనగర్​లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

murder
హత్య
author img

By

Published : Apr 1, 2021, 8:32 PM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కార్మిక నగర్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న 38ఏళ్ల సిద్దిఖ్ అహ్మద్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే ఉన్న ఫ్రిజ్‌లో ఉంచి ఇంటిబయట తాళం వేసి వెళ్లిపోయారు.

ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్రిజ్‌లో సిద్దిఖ్‌ మృతదేహం వెలుగుచూసింది. రెండు రోజుల క్రితమే మృతుని భార్య రుబీనా తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆస్తి తగాదాలా? లేక మరేదైనా కారణంతో హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్టున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.