నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్తా... ప్రాణాల మీదకు తెచ్చింది. బర్దీపూర్‌కి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్... కత్తితో అన్న మతిన్ గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన మతిన్ను.. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గతకొన్ని రోజుల నుంచి ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చినికి చినికి గాలివానలా తయారై గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చిందని వెల్లడించారు. మతిన్కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.
ఇదీ చదవండి: Viral Video: దారుణం: ట్యాబ్లెట్ ఇవ్వమని.. మెడికల్ షాపు యజమానిపై పిడిగుద్దుల వర్షం