ETV Bharat / crime

ATTACK: రేకుర్తిలో దారుణం.. భూమి రిజిస్ట్రేషన్​ చేయిస్తానని..! - రేకుర్తిలో దారుణం

కరీంనగర్‌ శివారు రేకుర్తిలో దారుణం జరిగింది. భూమి రిజిస్ట్రేషన్​ చేయిస్తానని నమ్మించి విచక్షణారహితంగా దాడి చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రగాయాలు పాలైన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

A man attack with talwar
కరీంనగర్‌ శివారు రేకుర్తిలో దారుణం
author img

By

Published : Jun 21, 2021, 10:47 PM IST

స్థలం రాసిస్తానని అతని వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లుగా రిజిస్ట్రేషన్​ చేస్తానని కాలయాపన చేశాడు. అంతలోనే స్థలం రాసిస్తానని పిలిపించి అతనిపై విచక్షణారహితంగా తల్వార్​తో దాడికి పాల్పడ్డాడు. కరీంనగర్‌ శివారు రేకుర్తిలో జరిగిన ఈ ఘటనలో బాధితునికి మెడ, చేతి నరాలు తెగి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రున్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రేకుర్తికి చెందిన ఓ విద్యుత్​ ఉద్యోగి తన వద్ద తీసుకున్న రూ.20 లక్షలకు తీసుకుని భూమి రిజిస్ట్రేషన్​ చేయిస్తానని పిలిచి దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. బొమ్మకల్​కు చెందిన గోలి శ్రీకాంత్ రేకుర్తికి చెందిన బంగారు మారుతికి రెండేళ్ల క్రితం నుంచి స్థలం రాసివ్వలేదని బాధితుడు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: TRIPLE MURDER: త్రిపుల్ మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.