ఆనందయ్య మందు అని చెప్పి అక్రమంగా ఔషధాన్ని విక్రయిస్తున్న వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని మోతడక గ్రామానికి చెందిన అన్నే కాంతారావు అనే వ్యక్తి.. కరోనా నివారణకు ఆనందయ్య ఔషధం తయారు చేస్తున్న మందు ఇదేనని చెప్పి స్థానికులకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది.
ఆనందయ్య మందు పేరుతో కాంతారావు ప్రజల్ని మోసం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇటువంటి వారిని నమ్మవద్దని.. ప్రజలకు సూచించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: CLP: ప్రభుత్వ భూముల వేలాన్ని అడ్డుకుంటాం: భట్టి