సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అంబేడ్కర్ కాలనీలో పదో తరగతి చదివే బాలిక అదృశ్యమైంది. సోమవారం రాత్రి తమతో కలిసి భోజనం చేసి పడుకున్న కూతురు.. ఉదయం కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి జోసెఫ్ తెలిపారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే జోసెఫ్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
స్థానికంగా గాలించినా ఆచూకీ లేదని వాపోయారు. పటాన్చెరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Corona: నెల రోజుల్లో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు!