Patancheru Car Fire: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు భాష్యం బ్లూమ్స్ గేటు ముందు అర్ధరాత్రి సమయంలో హోండా అమేజ్ కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఫ్రాన్సీస్ డిసెల్వా పాశమైలారం పారిశ్రామిక వాడలో వేగ కన్వేయస్ పరిశ్రమలో ఫైనాన్స్ లీగల్ హెచ్ఓడీగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని దాదాపు 1.30 ప్రాంతంలో TN 22 DF 7612 అనే నెంబరు గల కారులో వస్తుండగా వెనుక నుంచి పొగలు రావడం కారు మిర్రర్లో గమనించాడు. కారును రహదారిపై నిలిపేశాడు.
అతను కిందకి దిగిపోయిన వెంటనే కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. 100 నెంబర్కు ఫోన్ చేయగా పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
ఇవీ చదవండి: