A Female officer attempted suicide in Khammam: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మండలాధ్యక్షుడు దేవాదాయ శాఖలో అధికారిగా పని చేస్తున్న ఓ మహిళను దూషించినందున మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధితురాలు, తోటి సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని దేవాదాయ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి గ్రామీణ మండలం మారమ్మ గుడికి సంబంధించిన పాలకవర్గ నియామక ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ స్థానిక మండల అధ్యక్షుడు వేణు ఆమెకు ఫోన్ చేసి తమకు ఎందుకు చెప్పలేదని బెదిరించాడు. దీంతో పాటు ఆమెతో దురుసుగా మాట్లాడారు. ఆమె ఆ మాటలను తట్టుకోలేక మసస్తాపానికి గురై కార్యాలయంలోనే బీపీ మాత్రలు ఎక్కువగా మింగినట్లు చెప్పి అక్కడిక్కడే పడిపోయారు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: