కరోనా భయం (Fear Of Corona Virus) ఇప్పట్లో తగ్గేలా లేదు. పాలలో నల్లఉప్పు, పసుపు కలుపుకొని తాగితే కరోనా (Fear Of Corona Virus) రాదని చెప్పిన ఇతరుల మాటలు విన్న ఓ కుటుంబం.. తమ ప్రాణాల మీదకే తెచ్చుకుంది. వీరిలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు. హైదరాబాద్ మచ్చబొల్లారం చంద్రనగర్ కాలనీలో నివసించే నరేశ్ కుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పాలలో నల్లఉప్పు, పసుపు కలిపి తాగితే.. కరోనా (Fear Of Corona Virus) రాదనే ఇతరుల మాటలు నమ్మాడు.
ఇంటికి వచ్చి.. తల్లి లక్ష్మి, భార్యతో ఈ విషయం చెప్పాడు. పాలలో నల్లఉప్పు, పసుపు కలుపుకొని తాగితే.. అనారోగ్యం రాదు, కరోనా (Fear Of Corona Virus) కూడా రాదని చెప్పి నమ్మించాడు. ముగ్గురు కలిసి ఆ మిశ్రమాన్ని తాగారు. 20 నిమిషాల తర్వాత ముగ్గురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరేశ్ కుమార్ మృతి చెందగా.. తల్లి, భార్య చికిత్స పొందుతున్నారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: covid regulations: కొవిడ్ నిబంధనలకు అడుగడుగునా తూట్లు
No mask : నో మాస్క్, నో శానిటైజర్... మరో ముప్పు తప్పదా?
India covid cases: దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు
దేశంలో 80 శాతం మందికి మొదటి డోసు పూర్తి
ఆ దేశాల్లో మళ్లీ కరోనా భయం.. వేగంగా ఆస్పత్రుల నిర్మాణం.. త్వరలో లాక్డౌన్!