పాత కక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త మామిడివారి గూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామినేని నరేష్, కూరపాటి నరేష్ కుటుంబాల మధ్య పాత గొడవలు ఉన్నాయి.
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయం వద్ద సోమవారం రాత్రి ఇరువురు ఘర్షణ పడ్డారు. అది మంగళవారమూ కొనసాగింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవటంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
అశ్వరావుపేట సీఐ ఉపేంద్రరావు వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఓయూ లా కళాశాల విద్యార్థులు