ETV Bharat / crime

మహిళపైకి దూసుకెళ్లిన కారు.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు.. - viral videos

car accident in SR Nagar: హైదరాబాద్​లోని ఎస్సార్​నగర్​లో దారుణం జరిగింది. దీపావళి రోజున వీధిలో నిల్చున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. ప్రమాద సమయంలో కారు నడిపిన వ్యక్తి మైనర్​గా పోలీసులు గుర్తించారు.

car accident in SR Nagar
car accident in SR Nagar
author img

By

Published : Oct 31, 2022, 9:40 PM IST

ఎస్​ఆర్​ నగర్​లో దారుణం.. మహిళపై దూసికొచ్చిన కారు.. డ్రైవర్​ మైనర్​గా గుర్తింపు

car accident in SR Nagar: హైదరాబాద్​లోని ఎస్సార్​నగర్​లో దారుణం జరిగింది. దీపావళి రోజున వీధిలో నిల్చున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆమెకు బలమైన గాయాలు అయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. ప్రమాద సమయంలో కారు నడిపిన వ్యక్తి మైనర్​గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన సాప్ట్​వేర్​ ఉద్యోగి చైతన్య తన భార్య నిత్యతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడానికి కల్యాణనగర్​లో నివస్తున్న తన సోదరి ఇంటికి వచ్చారు. వీధిలో బాణసంచా కాల్చుతుండగా నిత్య రోడ్డుపై నిల్చోని ఉంది.

ఇంతలో వేగంగా వచ్చిన కారు ఆమెను బలంగా ఢీకొట్టి.. పక్కనే పార్క్​ చేసిన మరో కారును ఢీకొంది. వెంటనే కారు డ్రైవర్​ రివర్స్​ తీసుకొని అక్కడి నుంచి ఉడాయించగా.. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని బంజారాహిల్స్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారు నడిపిన వ్యక్తి మైనర్​గా గుర్తించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా.. పోలీసులు మైనర్​తో పాటు కారు యాజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.