వికారాబాద్ జిల్లా ముజాహిద్‌పూర్ మంచుకుంటతండా వద్ద... విద్యార్థులతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి(road accident in telangana) బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది విద్యార్థులున్నారు. పీరన్‌పల్లి, కుల్కచర్ల, కామునిపల్లికి చెందిన విద్యార్థులు.... ముజాహిద్‌పూర్‌లోని పాఠశాలకు వెళ్తున్నారు. ఆలస్యం కావడంతో అటుగా వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఆపి ఎక్కారు.
ఇదీ చదవండి: హాస్టల్ భవనంపై నుంచి దూకి... విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మూలమలుపు వద్ద అదుపుతప్పి..
అతివేగంగా వెళ్తున్న వాహనం మంచుకుంటతండా సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది(today accident in hyderabad 2021). ఎనిమిది మందికి తీవ్రగాయాలు కాగా... మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కొందరిని కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి... మరికొందరిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులు సీహెచ్.నవీన్, బి.చరణ్, వినయ్, ప్రవీణ్ పరిస్థితి విషమించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు.
ఇదీ చదవండి: తండ్రి ఇంటికి తీసుకెళ్లలేదని.. హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మా ఊరి ఆటో అని ఎక్కినం. అటువైపే పోతున్న.. అక్కడ దించుతా అని డ్రైవర్ అన్నాడు. లేట్ అవుతుందని పోయినం. చాలా స్పీడ్‌గా తోలిండు. స్పీడ్ ఎక్కువ కావడం వల్ల డైరెక్టుగా పడిపోయింది. అందులో మోడల్ స్కూల్, హైస్కుల్ వాళ్లు ఉన్నారు. పీరన్ పల్లి, కుల్కచర్ల, కామునిపల్లి, తండాకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.
-విద్యార్థి
ఇదీ చదవండి: