ETV Bharat / crime

దోస్తులు కదా అని ఇంటికి తీసుకొస్తే.. దోచేశారు - 75 lakhs theft at Salimnagar Colony

ఓ స్థిరాస్తి వ్యాపారి.. గోవా నుంచి వచ్చిన తన ఫ్రెండ్ పబ్​కు వెళ్దామంటే​ సరదాగా తీసుకెళ్లాడు. అక్కడ పాత ఫ్రెండ్​ కలిస్తే ఇద్దరూ అతనితో మాట కలిపారు. ఇంతలో తన ఫ్రెండ్​ అంటూ అతడు మరో వ్యక్తిని పరిచయం చేశాడు. ఫ్రెండ్​కి ఫ్రెండ్​ అంటే మనకూ ఫ్రెండే అనుకుంటూ నలుగురూ కలిసి అర్ధరాత్రి దాకా పబ్​లో గడిపారు. అనంతరం స్థిరాస్తి వ్యాపారి ఇంటికొచ్చి.. మందు పార్టీ మొదలెట్టారు. కట్​చేస్తే.. వ్యాపారి ఇంట్లోని బ్యాగులో ఉండాల్సిన రూ.75 లక్షలు మాయమయ్యాయి. అసలేమైందంటే..?

దోస్తులు కదా అని ఇంటికి తీసుకొస్తే.. దోచేశారు

author img

By

Published : Jul 31, 2022, 10:46 AM IST

మద్యం తాగేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. రూ.75 లక్షలతో పరారైన ఘటన ఇది. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మూసారాంబాగ్‌ డివిజన్‌ సలీమ్‌నగర్‌ కాలనీలో నివసించే సాయిప్రకాష్‌రెడ్డి (25) స్థిరాస్తి వ్యాపారి. గోవాకు చెందిన అతని మిత్రుడు ఫిరోజ్‌ శుక్రవారం రాత్రి వచ్చాడు. పబ్‌కు వెళ్దామని ఫిరోజ్‌ కోరడంతో కొత్తపేట్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు.

అక్కడ పాతమిత్రుడు రాజేష్‌ కలిశాడు. సాయిప్రకాష్‌రెడ్డి, ఫిరోజ్‌, రాజేష్‌లతోపాటు రాజేష్‌ మిత్రుడు.. నలుగురూ కలిసి అర్ధరాత్రి తర్వాత మద్యం తాగేందుకు తిరిగి సలీమ్‌నగర్‌లోని సాయిప్రకాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

ఫిరోజ్‌ ఓ గదిలో పడుకున్నాడు. హాలులో ముగ్గురు కలిసి మద్యం తాగారు. సాయిప్రకాష్‌రెడ్డి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. బయటికి వచ్చిన తర్వాత తన గదిలో బెడ్‌ మీద ఖాళీ బ్యాగు కనిపించింది. హాలులో రాజేష్‌ అతని స్నేహితుడు కనిపించలేదు. భూమి విక్రయించగా వచ్చిన రూ.75 లక్షల నగదు ఆ బ్యాగులో ఉందని బాధితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చూడండి..

CASINO CULTURE: పందెం మీది.. కమీషన్ మాది..

దేశంలో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. జపాన్​లో 2 లక్షలకుపైనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.