ETV Bharat / crime

నార్కోటిక్ వింగ్​, పోలీసులు సంయుక్త దాడి...72 కేజీల గంజాయి పట్టివేత - Telangana latest news

72 kg of ganja seized: హైదరాబాద్ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్, మంగళహాట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 72 కేజీల గంజాయితోపాటు 1.8 కేజీల గంజాయి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక బ్రెజా కార్ తో పాటు నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించి ముగ్గురు పెడ్లర్స్​ తో పాటు ఒక గంజాయి సప్లై చేసే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

Marijuana seeds were seized
గంజాయి పట్టివేత
author img

By

Published : Dec 10, 2022, 5:29 PM IST

72 kg of ganja seized : హైదరాబాద్ నార్కోటిక్​ ఎన్​ఫోర్స్​మెంట్ వింగ్, మంగళహాట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 72 కేజీల గంజాయితో పాటు 1.8 కేజీల గంజాయి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి ఒక బ్రెజా కారుతో పాటు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి ముగ్గురు పెడ్లర్లతో పాటు ఒక గంజాయి సప్లై చేసే వ్యక్తిని ఈరోజు మంగళ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు.

ఆకాష్ సింగ్ అనే యువకుడు షేక్ సుభాని అనే వ్యక్తి ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి గంజాయిని సప్లై చేయించుకునేవాడు. కాటేదాన్ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకొని చిన్న చిన్నపెడ్లర్లకు ఐదు కేజీల మొత్తంలో అమ్మి డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాటేదాన్​లో ఉన్న ఓ గదిని కూడా ఈ కేసులో అటాచ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని విక్రయదారులతో పాటు కొనుగోలుదారులను కూడా గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.