ETV Bharat / crime

హృదయ విదారకం: శంషాబాద్​ ప్రమాదంలో ఆరుగురు మృతి- 22 మందికి గాయాలు

బతుకుతెరువు కోసం భార్యాపిల్లలను తీసుకొని వందల కి.మీ. దూరం వచ్చి ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. వారాంతంలో సంతకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవిత ప్రయాణంలో కోలుకోలేని కుదుపు వచ్చింది. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఓ కారు రూపంలో వచ్చిన మృత్యువు... ఇటుక లారీలో వెళ్తున్న వారి కుటుంబాలను కబళించింది. ఆరుగురిని పొట్టనబెట్టుకోగా... మరో 22 మంది తీవంగా గాయపడ్డారు. కళ్ల ముందే విగతజీవులుగా మారిన తమ భర్తల కోసం చంటి పిల్లలతో రోధిస్తున్న ఆ దృశ్యం హృదయవిదారకం.

6 workers died in shamshabad accident
6 workers died in shamshabad accident
author img

By

Published : Apr 19, 2021, 3:29 AM IST

Updated : Apr 19, 2021, 5:38 AM IST

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఓ కారు ఇటుక లారీ కిందకు దూసుకెళ్లడంతో అది బోల్తా పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం శంషాబాద్‌ వద్ద రాళ్లగూడ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్‌ మండలం నర్కుడ-సుల్తాన్‌పల్లి మధ్యలో ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు నాలుగు నెలల కిందట ఒడిశాలోని చికిలి గ్రామానికి చెందిన కార్మికులను తీసుకొచ్చారు. నిత్యావసర సరకుల కోసం కార్మికులు ప్రతివారం శంషాబాద్‌ సంతకు వస్తుంటారు. ఆదివారం మధ్యాహ్నం ఇటుక లారీలో 50 మంది వరకు సంతకొచ్చారు. సాయంత్రం అదే లారీలో తిరిగి వెళ్తుండగా రాళ్లగూడ వద్దకు చేరుకోగానే అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి లారీకి కిందకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా లారీ బోల్తా కొట్టింది. అందులో ఉన్న కార్మికులు ఎగిరి కిందపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కృపాసునా (25), భూపాల్‌దీప్‌ (25), కాలా కుమార్‌ సునా (20) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారంతా వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చి లారీ, కారు కింద ఇరుక్కుపోయిన కార్మికులను బయటకు తీసేందుకు యత్నించారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులైన 20 మందిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో పరమానంద (55), సహదేవ్‌ (50), అక్షోటో (50) చికిత్స పొందుతూ మరణించారని వైద్యులు తెలిపారు.

డ్రైవర్లు ఇద్దరూ మద్యం తాగారా?

రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీ, నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో పోలీసులు పక్కకు తొలగించారు. ప్రమాదంపై వారు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఆ కారు ఎవరిది? ఎంతమంది ఉన్నారు? అనే కోణంలో కూపీ లాగారు. కారు నడిపిన వ్యక్తి మద్యం తాగి అతివేగంతో దూసుకొచ్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్‌ కూడా తరచూ మద్యం తాగి వాహనం నడుపుతాడని, తాము ఎన్నిసార్లు మొత్తుకున్నా వినలేదని కార్మికులు పోలీసుల దగ్గర వాపోయారు. చట్టవిరుద్ధంగా ఇటుక లారీలో ప్రయాణికులను తరలించినందుకు డ్రైవర్‌ సహా లారీ యజమాని పైనా, ఇటుక బట్టీ నిర్వాహకులపైనా కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

కారకులపై పోలీసుల గోప్యత!

ఆ కారులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వారంతా కానిస్టేబుళ్లని విశ్వసనీయవర్గాల సమాచారం. అందుకే పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు ఒక విందులో పాల్గొని శంషాబాద్‌ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. రాళ్లగూడ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించి లారీని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. అయితే ‘ఆ కారులో ఉన్నది ఎవరో ఇంకా గుర్తించలేదు. దర్యాప్తు కొనసాగుతుంది’ అని సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

భార్యల కళ్లెదుటే మృత్యువాత

క్షతగాత్రులు

వారంతా బతుకుతెరువు కోసం భార్య పిల్లలను తీసుకొని వందల కి.మీ. దూరం వచ్చి ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో భార్యల కళ్లెదుటే ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. పసి పిల్లలతో ఉన్న ఆ తల్లుల రోదన హృదయవిదారకంగా ఉంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భూపాల్‌దీప్‌(25)కు భార్య దరమోతి, బాబు (8 మాసాలు) ఉన్నాడు. భూపాల్‌ అక్కడికక్కడే మృతి చెందగా భార్య, పసి బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకపక్క భర్త కళ్లముందే చనిపోయి రోదిస్తున్న ఆమె బాలుడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో తన బాధను పంటి బిగువున భరిస్తూ పాలు తాగిస్తుండడం చూసినవారి హృదయాలను కదిలించింది. కాలాకుమార్‌ సునా (20), కల్పన దంపతులకు ఏడాది క్రితమే పెళ్లయింది. గుండెలవిసేలా రోదిస్తున్న కల్పనను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. కృపాసునా (25), కుంతి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు మృతి చెందడంతో భార్య పిల్లల బతుకులు రోడ్డునపడ్డాయి. బూధన్‌ (25), హస్తాయాదవ్‌ (55) కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి.

ఇదీ చూడండి: కొవిడ్‌ నిబంధనలు గాలికొదిలేస్తున్న వ్యాపారులు, ప్రజలు

Last Updated : Apr 19, 2021, 5:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.